News September 10, 2025

‘అర్క’ టమాటతో రైతుకు భరోసా

image

టమాటను ఆకుముడత, వడలు తెగులు, ఆకు మాడు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి కట్టడికి IIHA బెంగళూరు ‘అర్కరక్షక్’, ‘అర్క సామ్రాట్’, ‘అర్క అబేద్’ హైబ్రిడ్ రకాలను తీసుకొచ్చింది. ‘అర్క రక్షక్’, ‘అర్కసామ్రాట్’లు ఆకుముడత, వైరస్, వడలు తెగులు, తొలి దశలో ఆకుమచ్చ, మాడు తెగుళ్లను తట్టుకొని 140 రోజులలో ఎకరాకు 30-34 టన్నుల దిగుబడినిస్తాయి. ‘అర్క అబేద్’ 140-150 రోజుల్లో 30-32 టన్నుల దిగుబడినిస్తుంది.

Similar News

News March 22, 2026

‘యో సూస్కోబఢ్లా’.. ‘ధురంధర్-2’ సీన్‌లో కెమెరామ్యాన్!

image

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ధురంధర్-2 ఇప్పుడు ఓ సిల్లీ రీజన్‌కు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఓ ఫైట్ సీన్‌లో కెమెరామ్యాన్ కనిపించడంతో ఆ క్లిప్ ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. దీంతో ఇన్నిరోజులు ‘పీక్ డీటైలింగ్’ అంటూ దర్శకుడు ఆదిత్యధర్‌ను ఎత్తేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు. అది చిన్న తప్పే అయినా సీన్‌లో అది స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

image

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.