News September 10, 2025

అత్తిలిలో నేటి నుంచి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్

image

అత్తిలి రైల్వే స్టేషన్‌లో బుధవారం నుంచి సర్కార్, తిరుపతి పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కూటమి నేతలు అత్తిలి మండలంలో ఆటో ప్రచారం ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేందుకు గత కొంతకాలంగా చేస్తున్న పోరాటం ఫలించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 4న కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైలు హాల్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 31, 2026

ఉండి: ఆస్తి తగదా.. బంధువుపై కత్తితో దాడి

image

ఆస్తి తగాదాలతో ఉండికి చెందిన శేషాద్రి శ్రీనివాస్‌పై ఆయన బంధువు కత్తితో దాడి చేశారు. సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉండి ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

News March 31, 2026

తణుకు జాతీయ రహదారిపై యాక్సిడెంట్

image

తణుకు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ఫ్రూట్స్ లోడుతో వస్తున్న ఆటో తేతలి వై జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.