News September 10, 2025

కార్మికుల పిల్లలకు రూ.25,000 వరకు స్కాలర్‌షిప్

image

కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు చదువును బట్టి రూ.25,000 వరకు ఏటా<> స్కాలర్ షిప్ <<>>అందిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న <<-se_10012>>విద్యార్థులు<<>> ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు అక్టోబర్ 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://scholarships.gov.in/

Similar News

News September 10, 2025

అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా SIR!

image

ఓటర్ జాబితా రీవెరిఫికేషన్‌కు సంబంధించి బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(<<17634931>>SIR<<>>) త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్నట్లు సమాచారం. OCT నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్‌తో జరిగిన మీటింగ్‌లో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెలలోనే గ్రౌండ్ వర్క్ పూర్తిచేస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం.

News September 10, 2025

జూబ్లీహిల్స్‌లో BRS గెలిస్తే ప్రభుత్వం మారదు: పొన్నం

image

TG: ఇళ్ల కూల్చివేతపై <<17666775>>కేటీఆర్<<>> మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేళ్లు పాలించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. గతంలో ఉపఎన్నికల్లో రూ.కోట్ల డబ్బులు, లిక్కర్ సీసాలు బీఆర్ఎస్ పంచిందని ఫైరయ్యారు. జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినంతా మాత్రాన ప్రభుత్వం మారదన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయనివాడు జూబ్లీహిల్స్‌కు ఏం చేస్తాడని దుయ్యబట్టారు.

News September 10, 2025

మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది: సుప్రీంకోర్టు

image

నేపాల్, బంగ్లాలో నిరసనలతో ప్రభుత్వాలు కూలిపోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్‌‌‌ పరిస్థితి చూడొచ్చు’ అని చీఫ్ జస్టిస్ BR గవాయ్ అన్నారు. బంగ్లాలోనూ ఇదే జరిగిందని జస్టిస్ విక్రమ్‌నాథ్ గుర్తుచేశారు. రాష్ట్ర బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించాలన్న పిటిషన్‌పై వాదనల సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.