News September 10, 2025
చిత్తూరు డీసీసీబీ అవినీతి గుట్టురట్టు

చిత్తూరు డీసీసీబీలో జరిగిన అవినీతి గుట్టు రట్టయింది. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ఆర్థిక విధ్వంసం జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్ఓ మోహన్ కుమార్ విచారణ జరిపి నివేదిక కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అందజేయగా చర్యలు తీసుకోవాలని డీసీఓను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. గత పాలకమండలితోపాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News March 11, 2026
చిత్తూరు జిల్లా అధికారులు తనిఖీలు చేసేనా?

గ్యాస్ డిమాండ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల పంపిణీని నిలిపివేయడంతో గృహ అవసరాల సిలిండర్లని హోటళ్లకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు గ్యాస్ పక్కదారి పట్టకుండా షాపులపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.
News March 11, 2026
చిత్తూరు: మల్చింగ్ పేపర్ ధరకు రెక్కలు

చిత్తూరు జిల్లాలో పలువురు రైతులు మల్చింగ్ పేపర్‌తో సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. టమాటా సాగులోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల ధర పెరగడంతో మల్చింగ్ ధరకు రెక్కలు వచ్చాయి. గతేడాది ఓ రోల్ రూ.2300 ఉండగా ప్రస్తుతం రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
News March 11, 2026
అమరావతికి వెళ్లిన చిత్తూరు కలెక్టర్

సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నేడు, రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం అమరావతికి వెళ్లారు. కలెక్టర్ తిరిగి వచ్చే వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 13 నుంచి సుమిత్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.


