News September 10, 2025

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై ఛార్జ్ షీట్..!

image

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతల చెవిరెడ్డి భాస్కర్, MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్.. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే MPకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు మోహిత్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డిపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో వీరి భవితవ్యం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.

Similar News

News April 1, 2026

పుదుచ్చేరి ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా మంత్రి పొన్నం

image

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినర్, ఎన్నికల పరిశీలకునిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఏఐసీసీ నియమించించింది. నేటి నుంచి మూడు రోజులు ఆయన పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ, పార్టీ విజయానికి కృషి చేయనున్నారు. ఆయన వెంట కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ప్రచారానికి వెళ్లనున్నారు.

News April 1, 2026

తిరుపతి స్విమ్స్‌లో అరుదైన ఆపరేషన్లు

image

తిరుపతి స్విమ్స్ యూరాలజీ విభాగం డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన మూడు ఆపరేషన్లను విజయవంతంగా చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ తెలిపారు. డా.అనిల్ కుమార్ నేతృత్వంలో కిడ్నీ క్యాన్సర్‌తో పాటు రాళ్లు ఉన్న రోగికి ఎలాంటి అపాయం లేకుండా ప్రత్యేక ఆపరేషన్ చేశారు. చిన్నారి వృషణ క్యాన్సర్ కేసులో టెస్టిస్‌ను రక్షించారు. మదనపల్లెకు చెందిన యువకుడిలో ట్యూబర్‌కులోసిస్ గడ్డను తొలగించారు.

News April 1, 2026

కైరవాడిలో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

గోనెగండ్ల మండలం కైరవాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా నగదు అందజేసిన ఆమె, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ వేకువజాము నుంచే పారదర్శకంగా ప్రారంభమైందని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం నేరుగా ఇంటికే సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.