News September 10, 2025
మైథాలజీ క్విజ్ – 2

1. దశరథుడి తండ్రి పేరేంటి?
2. మహాభారతంలో ‘గాంగేయుడు’ అని ఎవర్ని అంటారు?
3. ‘చిఖల్ కలో’ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు మనం ఏ పండగ జరుపుకుంటాం?
5. తుంబురుడి వీణ పేరేంటి?
6. ‘శ్వేత సౌధం’(The White Pagoda) అని ఏ ఆలయాన్ని అంటారు?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Similar News
News September 10, 2025
వరుస టాస్ ఓటములకు తెరదించిన టీమ్ ఇండియా

టీమ్ ఇండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. ఇవాళ ఆసియా కప్‌లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ వరుస టాస్ ఓటములకు తెరదించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా 15 మ్యాచ్‌ల్లో IND టాస్ ఓడిన విషయం తెలిసిందే. 16వ మ్యాచ్‌లో ఈ స్ట్రీక్‌కు బ్రేక్ పడింది. అటు ఇవాళ్టి మ్యాచ్‌లో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్‌కు చోటుదక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని తనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
News September 10, 2025
చంద్రగ్రహణానికి నలుగురు PMలు బలి: గోయెంకా

వివిధ దేశాల ప్రధానులు పదవులు కోల్పోవడంపై పారిశ్రామికవేత్త గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో రెండు రోజుల వ్యవధిలో జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్ PMలు బలయ్యారు. ఇప్పుడు అందరి చూపు సూర్య గ్రహణంపై పడింది. తర్వాత బలయ్యేది ఓ పెద్ద ‘ఆరెంజ్ టింటెడ్’ లీడర్ కావొచ్చు’’ అంటూ జోస్యం చెప్పారు. దీంతో ఆ లీడర్ ఆరెంజ్ కలర్ హెయిర్‌తో ఉండే ట్రంపేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News September 10, 2025
57 పరుగులకే UAE ఆలౌట్

టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటారు. శివమ్ దూబే 3, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. యూఏఈ బ్యాటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 22 మాత్రమే. మరి భారత్ ఎన్ని ఓవర్లలో ఈ టార్గెట్ ఛేదిస్తుందో కామెంట్ చేయండి.