News September 10, 2025

కొవ్వూరులో కుళ్లిన మృతదేహం లభ్యం

image

కొవ్వూరులోని వైఎస్టీడీ మాల్ సమీపంలోని ఓ భవనంపై గుర్తుతెలియని వ్యక్తి కుళ్ళిన మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 19, 2026

పెరవలిలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

image

పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, యువకుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

News March 19, 2026

కలెక్టరేట్‌లో ఉగాది సంబరాలు

image

రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి MLC సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

News March 19, 2026

అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

image

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.