News September 10, 2025

MHBD: ‘చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి’

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమికోసం, భుక్తి కోసం వీర నారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోని ముందుకు నడవాలన్నారు.

Similar News

News September 10, 2025

మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ టైం

image

ఈ నెల 15వ తేదీ నుంచి నాగ్ పూర్- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సమయం ఖరారైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే రైలు 7.20కి బల్లార్షకు, 8.49కి మంచిర్యాల, 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. తిరిగి ఒంటిగంటకు బయలుదేరి మంచిర్యాలకు మధ్యాహ్నం 3.17 గంటలకు చేరుతుంది.

News September 10, 2025

గద్వాల జిల్లాలో పెరుగుతున్న కుక్క కాటు బాధితులు

image

జోగులాంబ గద్వాల జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 2,000 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారని సమాచారం. పాముకాటుకు గురైన వారి సంఖ్య కూడా 20 వరకు ఉంది. కొన్ని గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. ప్రజల ప్రాణాలకు ముప్పు రాకముందే రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 10, 2025

అవార్డులు బాధ్యతను పెంచుతాయి: కలెక్టర్

image

అవార్డులు బాధ్యతను పెంచుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం చేసి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్‌తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.