News September 10, 2025
JGTL: ’90 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లో జరగాలి’

జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ వైద్యులతో కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య 90 శాతానికి పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందని, పనితీరు మెరుగు పరుచుకోవాలని హెచ్చరించారు. వచ్చే మూడు నెలల్లో డెలివరీల సంఖ్య 90 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలే చూడాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు.
Similar News
News March 26, 2026
NGKL: జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం బాధాకరం: ఎంపీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ విడిపోవడం ఎంతో బాధాకరమని నాగర్‌కర్నూల్ డాక్టర్ మల్లు రవి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో కొనసాగి అడగాలి తప్ప పార్టీ మారడం సరైనది కాదని అన్నారు. కొన్ని రాజకీయ సమీకరణల వల్ల అందరికీ పదవులు రావని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ అని గుర్తు చేశారు. ఇలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదన్నారు.
News March 26, 2026
గంగవరం: బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో జరిగింది. ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు జుబేర్, శ్రీధర్ బైక్‌పై పలమనేరుకు బయలుదేరారు. మేలుమయి గ్రామానికి చెందిన దొరస్వామి (55) పలమనేరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మేలు మయి క్రాస్ వద్ద వీరి వాహనాలు ఢీకొన్నాయి. సీఎంసీకి తరలిస్తుండగా దొరసామి మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 26, 2026
పెట్రోల్ సమస్య.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్!

హైదరాబాద్‌లో పెట్రోల్ సమస్యతో కొన్ని IT కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మొదలుపెట్టాయి. విప్రో, యాక్సెంచర్, TCS వంటి పెద్ద కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా, మరికొన్ని సంస్థలు 50-50 విధానం తీసుకొచ్చాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంది. HYDలో దాదాపు 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో సగం మంది బైకులు, కార్లలో రాకపోకలు సాగిస్తారని సమాచారం.


