News September 10, 2025
JGTL: జిల్లా ఉపాధ్యాయుడి అరుదైన ఘనత

గొల్లపల్లి మం. వెనుగుమట్ల HS జీవశాస్త్ర టీచర్ తిరుపతి 2వ సారి జాతీయస్థాయి శిక్షణ సదస్సుకి హాజరవుతూ అరుదైన ఘనత సాధించారు. 2021లో ఒకసారి, ఇప్పుడు సీసీఆర్టీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు నిర్వహిస్తున్న ఎన్ఈపీ- 2020 ఓరియంటేషన్‌కు రాష్ట్రంలో 10మంది నిష్ణాతులైన టీచర్లను ఎంపిక చేయగా, జిల్లా నుంచి తిరుపతి ఎంపికయ్యారు. ఈనెల 8-27వరకు 21రోజులు HYD మాదాపూర్లో శిక్షణ ఇవ్వనున్నారు.
Similar News
News March 10, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్తీక్ మృతి

ఎచ్చెర్ల ప్రధాన రహదారిలోని సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనం <<19333513>>బోల్తా<<>> ఘటనలో అరసవిల్లి కార్తీక్ (18) గాయపడిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు మధు చరణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రహదారిపై మొక్కజొన్న పంట టార్పాలిన్ కప్పి ఉండడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అతడిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
News March 10, 2026
KNR: 14న బండి సంజయ్ యాత్ర

ఇచ్చిన మాట ప్రకారం కరీంనగర్ మేయర్ పీఠంతో పాటు స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఈనెల 14న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమై, 40 కి.మీల మేర సాగే ఈ పాదయాత్ర సాయంత్రానికి కొండగట్టు చేరుకుంటుంది. నూతన ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఆయన మొక్కులు తీర్చుకోనున్నారు.
News March 10, 2026
అమలాపురం: అన్నం ఉడకలేదని భర్త కొట్టాడు.. 112కి కాల్ చేసిన భార్య..!

అమలాపురం పట్టణంలోని మెట్ల కాలనీలో ఓ మహిళ నుంచి పోలీసులకు విచిత్రమైన పిలుపు అందింది. వండిన అన్నం సరిగ్గా ఉడకలేదనే కారణంతో భర్త తనను కొట్టాడంటూ ఆమె 112కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకోగా భర్త అక్కడ లేరు. దీంతో పోలీసులు ఆమెతో భర్తకు ఫోన్ చేయించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న విషయాలకే పోలీసులకు ఫోన్ చేయడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.


