News September 10, 2025

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి ఫిక్స్?

image

జూబ్లీహిల్స్ నుంచి BRS తరఫున మాగంటి సతీమణి సునీతను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణభవన్‌లో జరిగిన రహమత్‌నగర్‌ బూత్‌ కమిటీ మీటింగ్‌లో KTR పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని టాక్. ‘శ్రీమతి సునీత గారికి ప్రజల ఆశీర్వాదం ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ధీమాతోనే మాగంటి ఇంటిల్లి పాది విస్రృత పర్యటనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థిత్వంపై అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News September 10, 2025

HYD: పోటెత్తిన వరద.. జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

image

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో బుధవారం గేట్లు తెరిచారు. హిమాయత్‌సాగర్‌ ఒక గేటు ఎత్తి 671 క్యూసెక్కుల నీటిని కిందికి వదలారు. ఉస్మాన్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.55 అడుగులు, గండిపేట పూర్తి స్థాయి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,789.15 అడుగుల నీరుంది.

News September 10, 2025

BREAKING: కూకట్‌పల్లిలో మహిళ హత్య

image

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2025

పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

image

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.