News September 10, 2025

WGL: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

image

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు వరంగల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న ఒక్కరోజే పోలీసులు 8 కేసుల్లో 15 మందిని అరెస్ట్ చేసి, 12 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో పాలకుర్తిలో 4, రాయపర్తిలో 3, దేవరుప్పులలో 1 చొప్పున నమోదు అయ్యాయి. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Similar News

News March 18, 2026

ఉగాది పండుగకు ఇందూర్ సిద్ధం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉగాది పండుగ అటు భక్తిని, ఇటు గ్రామీణ సాహస క్రీడలను కలబోసిన వేడుకలా నిలుస్తోంది. మాక్లూర్ మండలం ఓడ్డేట్‌పల్లిలో ఒడ్డేటమ్మ తల్లి జాతరతో భక్తులు పులకించిపోతుంటే, పల్లెల్లో కళాకారుల జడ కొప్పులాట, కుస్తీ పోటీలు పాతకాలపు వైభవాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇక, కామారెడ్డిలో ఎడ్లబండ్ల కొరతతో రైతులు తమ ట్రాక్టర్లనే అందంగా అలంకరించి ఊరేగించడం సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు.

News March 18, 2026

పార్లమెంట్‌లో అమరావతి కళాఖండాల అంశం

image

ప్రాచీన అమరావతి నాగరికత, ఆచార్య నాగార్జునుడికి చెందిన ఎన్నో కళాఖండాలు విదేశీ మ్యూజియంలలో ఉన్నాయి. లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఇవి కొలువు దీరాయి. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వీటిని అక్కడికి తరలించారు. ఈ కళాఖండాలను వెనక్కి రప్పించే అంశం తాజాగా పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికే 600కు పైగా కళాఖండాలను భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. మిగతా వాటిని కూడా రప్పించనున్నారు.

News March 18, 2026

కడప: రైతులకు చెల్లించాల్సింది ఎంతో.. చెళ్లించింది కొంతే.!

image

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.