News September 10, 2025

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి ఫిక్స్?

image

జూబ్లీహిల్స్ నుంచి BRS తరఫున మాగంటి సతీమణి సునీతను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణభవన్‌లో జరిగిన రహమత్‌నగర్‌ బూత్‌ కమిటీ మీటింగ్‌లో KTR పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని టాక్. ‘శ్రీమతి సునీత గారికి ప్రజల ఆశీర్వాదం ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ధీమాతోనే మాగంటి ఇంటిల్లి పాది విస్రృత పర్యటనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థిత్వంపై అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News March 16, 2026

మన్యం: ఇప్ప పువ్వు.. ఆదివాసీలకు ఆదాయ వనరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీ గ్రామాల్లో ఇప్ప పువ్వుల సేకరణ జోరుగా సాగుతోంది. అడవుల్లో లభించే ఈ పువ్వులను గ్రామస్థులు ఫిబ్రవరి నుంచి మే నెలవరకు సేకరించి ఎండ బెట్టి అమ్ముతుంటారు. ఈ పువ్వుల పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. ఈ ఇప్ప పువ్వును ఆదివాసీ గ్రామాల్లో ముఖ్యమైన ఆదాయ వనరులుగా భావిస్తారు.

News March 16, 2026

ఆస్కార్-2026 విజేతలు..

image

*ఉత్తమ సహాయ నటి – ఎమీ మ్యాడిగన్(వెపన్స్)
*బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కెపాప్ డిమోన్ హంటర్స్ (మ్యాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్, మిషెల్లీ వాంగ్)
*బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్(క్రిస్ లావిస్, మసీక్ జెజెర్బోవ్‌స్కీ)
*బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – కేట్ హాలే(ఫ్రాంకెన్‌స్టైన్)
*మేకప్ & హెయిర్ స్టైల్ – మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యురే (ఫ్రాంకెన్‌స్టైన్)

News March 16, 2026

చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

image

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.