News September 10, 2025

జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో ఐలమ్మ వర్ధంతి

image

జనగామ పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ భూ పోరాటంలో వెట్టి చాకిరి, విముక్తి కోసం దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. మున్సిపల్ అధికారులు రాములు, గోపయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 10, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరం మండలం రీమా పేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2025

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో బుధవారం సమీక్షించారు. కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాట్సాప్ గవర్నెన్స్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

News September 10, 2025

వరుస టాస్ ఓటములకు తెరదించిన టీమ్ ఇండియా

image

టీమ్ ఇండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. ఇవాళ ఆసియా కప్‌లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ వరుస టాస్ ఓటములకు తెరదించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా 15 మ్యాచ్‌ల్లో IND టాస్ ఓడిన విషయం తెలిసిందే. 16వ మ్యాచ్‌లో ఈ స్ట్రీక్‌కు బ్రేక్ పడింది. అటు ఇవాళ్టి మ్యాచ్‌లో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్‌కు చోటుదక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని తనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.