News September 10, 2025
ఈనెల 23 నుంచి సింహాచలంలో శరన్నవరాత్రులు

సింహాచలంలో శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్ర ఉత్సవములు ఈనెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయిని ఈ.ఓ వేండ్ర త్రినాథరావు బుధవారం తెలిపారు. ప్రతిరోజూ విశేష ఉత్సవములు, రామాయణ పారాయణం, సాయంత్రం బేడా తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. OCT 02న విజయదశమి సందర్భంగా శమీపూజ మహోత్సవం, పూలతోటలో జమ్మి వేటతో జరుగుతాయన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు దర్శనం కల్పిస్తామన్నారు.
Similar News
News September 10, 2025
మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ టైం

ఈ నెల 15వ తేదీ నుంచి నాగ్ పూర్- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సమయం ఖరారైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే రైలు 7.20కి బల్లార్షకు, 8.49కి మంచిర్యాల, 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. తిరిగి ఒంటిగంటకు బయలుదేరి మంచిర్యాలకు మధ్యాహ్నం 3.17 గంటలకు చేరుతుంది.
News September 10, 2025
గద్వాల జిల్లాలో పెరుగుతున్న కుక్క కాటు బాధితులు

జోగులాంబ గద్వాల జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 2,000 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారని సమాచారం. పాముకాటుకు గురైన వారి సంఖ్య కూడా 20 వరకు ఉంది. కొన్ని గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. ప్రజల ప్రాణాలకు ముప్పు రాకముందే రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News September 10, 2025
అవార్డులు బాధ్యతను పెంచుతాయి: కలెక్టర్

అవార్డులు బాధ్యతను పెంచుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం చేసి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్‌తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.