News September 10, 2025

బిడ్డకు జన్మనిచ్చిన మెగా కపుల్

image

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. మెగా ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తేజ్-లావణ్య వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News March 5, 2026

❤️నచ్చేశావ్ సంజూ..

image

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.

News March 5, 2026

విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.

News March 5, 2026

సెమీస్.. భారత్ భారీ స్కోర్

image

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.