News September 10, 2025
కలెక్టరేట్‌ను ముట్టడించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్

మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ నాయకులతో కలిసి బుధవారం ములుగు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు ఎంపీతో పాటు కొందరు నాయకులను పోలీసులు అనుమతించారు.
Similar News
News March 18, 2026
ఉగాది పండుగకు ఇందూర్ సిద్ధం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉగాది పండుగ అటు భక్తిని, ఇటు గ్రామీణ సాహస క్రీడలను కలబోసిన వేడుకలా నిలుస్తోంది. మాక్లూర్ మండలం ఓడ్డేట్‌పల్లిలో ఒడ్డేటమ్మ తల్లి జాతరతో భక్తులు పులకించిపోతుంటే, పల్లెల్లో కళాకారుల జడ కొప్పులాట, కుస్తీ పోటీలు పాతకాలపు వైభవాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇక, కామారెడ్డిలో ఎడ్లబండ్ల కొరతతో రైతులు తమ ట్రాక్టర్లనే అందంగా అలంకరించి ఊరేగించడం సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు.
News March 18, 2026
పార్లమెంట్‌లో అమరావతి కళాఖండాల అంశం

ప్రాచీన అమరావతి నాగరికత, ఆచార్య నాగార్జునుడికి చెందిన ఎన్నో కళాఖండాలు విదేశీ మ్యూజియంలలో ఉన్నాయి. లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఇవి కొలువు దీరాయి. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వీటిని అక్కడికి తరలించారు. ఈ కళాఖండాలను వెనక్కి రప్పించే అంశం తాజాగా పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికే 600కు పైగా కళాఖండాలను భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. మిగతా వాటిని కూడా రప్పించనున్నారు.
News March 18, 2026
కడప: రైతులకు చెల్లించాల్సింది ఎంతో.. చెళ్లించింది కొంతే.!

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.


