News September 10, 2025

VKB: ఐలమ్మ పోరాటపటిమను ఆదర్శంగా తీసుకోవాలి: అ.కలెక్టర్

image

భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన చాకలి ఐలమ్మ పోరాటపటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News March 20, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤అరసవల్లి ఇంద్రపుష్కరిణి అభివృద్ధికి రూ.4కోట్లు మంజూరు
➤శ్రీకాకుళం జిల్లాలో సుర్రుమన్న ఎండలు
➤కవిటి: కళారత్న అవార్డును అందజేసిన సీఎం చంద్రబాబు.
➤శ్రీకాకుళం: BRAU లో ఫ్యాకల్టీ సమస్య పరిష్కారం అవుతుందా ?
➤ఎచ్చెర్ల: రోడ్డుపై గోతులు.. వాహనదారులు ఇబ్బందులు
➤ఎల్.ఎన్.పేటలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
➤ఉగాది వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు

News March 20, 2026

జగిత్యాల : ఇంటర్మీడియట్ 3వ విడత మూల్యాంకనం ప్రారంభం

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్ మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతున్నట్లు క్యాంప్ ఆఫీసర్ నారాయణ తెలిపారు. వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, వాణిజ్యశాస్త్రం, చరిత్ర సబ్జెక్టులలో మూల్యాంకనం ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. మూల్యాంకన విధులలో ఎవరికి మినహాయింపు లేదని పేర్కొన్నారు.

News March 19, 2026

‘ధర్మపురి బస్సు డిపో మంజూరుకు కృషి చేస్తా’

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ధర్మపురిలో బస్ డిపో మంజూరు కోసం కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాల వరకు ధర్మపురిలో బస్ డిపో నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. గురువారం ధర్మపురిలోని ఎస్‌హెచ్ గార్డెన్‌లో ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.