News September 10, 2025

అనంతపురం చేరుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

image

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురానికి చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్, మంత్రులు, అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. 15 నెలల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను వివరించనున్నారు. ఈ సభకు లక్షలాది మంది తరలిరావడంతో ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది.

Similar News

News September 10, 2025

కల్వకుర్తి: గుండెపోటుతో థియేటర్ యజమాని మృతి

image

కల్వకుర్తిలోని నేషనల్ థియేటర్ ప్రొప్రైటర్ దీపక్(44) గుండెపోటుతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దీపక్ బుధవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందినట్లు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉండే దీపక్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

News September 10, 2025

నిర్మల్: సూక్ష్మ హరిత ఆహార కేంద్రం ప్రారంభం

image

నిర్మల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు కలిసి సూక్ష్మ హరిత ఆహార కేంద్రాన్ని ప్రారంభించారు. సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. అలాగే మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వారి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మా బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

News September 10, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤నరసన్నపేట: గ్యాస్ లీకై.. వ్యాపించిన మంటలు
➤పాతపట్నం: బురదలో కూరుకుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్
➤టెక్కలి: మండుటెండలో విద్యార్థుల అవస్థలు
➤ఎచ్చెర్ల: అంబేడ్కర్ వర్శిటీ నూతన రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
➤సరుబుజ్జిలి: ధర్మల్ ప్లాంట్‌ను వ్యతిరేకించిన ఆదివాసీలు
➤శ్రీకాకుళం: 11న డయల్ యువర్ ఆర్ఎం
➤ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్