News September 10, 2025
భద్రాద్రి: పల్లె ప్రకృతి వనాలు.. పశువులకు నిలయాలు!

అళ్లపల్లి మండలం మైలారం పాఠశాల పక్కన లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గేదెల మేతకు నిలయంగా మారింది. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వనంలో చెట్లు నాశనమవుతున్నాయి. అధికారులు వెంటనే దీని చుట్టూ కంచె ఏర్పాటు చేసి మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News March 12, 2026
కూతురికి గన్ ఫైరింగ్ నేర్పిస్తున్న కిమ్

గన్‌తో ఫైరింగ్ ఎలా చేయాలో తన కూతురికి దగ్గరుండి నేర్పిస్తున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి ఆయన ఇవాళ ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. గురిచూసి కాలుస్తున్న వీరిద్దరి ఫొటోలను అక్కడి మీడియా విడుదల చేసింది. ప్రతి ఈవెంట్‌కు తనతో పాటు తీసుకెళ్లడం, దగ్గరుండి షూటింగ్ నేర్పిస్తుండటంతో తదుపరి వారసురాలిగా కిమ్ జూ ఏను ఆయన సిద్ధం చేస్తున్నారనే ప్రచారం బలపడుతోంది.
News March 12, 2026
వేములవాడ: యుద్ధం ఎఫెక్ట్.. హోటళ్లు బంద్

వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు మెయిన్ రోడ్డులోని హోటళ్లు, కర్రీ పాయింట్లు గ్యాస్ సిలిండర్స్ లేక మూతపడ్డాయి. కొందరు హోటళ్ల నిర్వాహకులు ధరలు పెంచుతున్నారని కస్టమర్లు చెబుతున్నారు. ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ రవాణా నిలిచిపోవడంతో సిలిండర్ల సరఫరా ఆగిపోయి ఈ పరిస్థితి ఏర్పడిందని హోటల్ యజమానులు చెబుతున్నారు.
News March 12, 2026
పాలమూరు: కన్నీటి ‘బోరు’.. కడతేరిన తల్లి, ఇద్దరు కూమార్తెలు

ఆ కుటుంబంలో బోరు బావి నీళ్లు పోస్తుందో లేదో తెలియదు కానీ, కన్నీళ్లు మాత్రం ఏరులై పారాయి. భర్త మొండితనం, భార్య క్షణికావేశం ఒక నిండు సంసారాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. పొలంలో మరో బోరు వేయొద్దని భార్య వారించినా వినకపోవడంతో మనస్తాపానికి గురై తల్లి, ముగ్గురు బిడ్డలతో కలిసి బావిలోకి దూకిన ఘటన భూత్పూర్ పరిధిలోని ఎల్కిచర్లలో కలకలం రేపింది. జంగమ్మ, జ్యోతి, శైలజ మృతి చెందారు. బాబు క్షేమంగా బయటపడ్డాడు.


