News September 10, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: JD

image

జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. ఇప్పటివరకు 12,500 టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా వెయ్యి టన్నుల యూరియా అందుబాటులో ఉందని, 2,500 టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భూసారాన్ని బట్టి యూరియాను వాడాలని, అధికంగా వాడితే భూమి సారాన్ని కోల్పోతుందని, పంటలో నాణ్యత దిగుబడి తగ్గుతుందని సూచించారు.

Similar News

News September 11, 2025

చిత్తూరు: పశువ్యాధి నివారణ గోడ పోస్టులు ఆవిష్కరించిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ చాంబర్‌లో జాతీయ పశువ్యాధి నియంత్రణ గోడపోస్టర్లను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పశువులకు సమయానుకూలంగా టీకాలు వేయడం ద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని రైతులు, పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 10, 2025

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం సమగ్ర శిక్ష APC మద్దిపట్ల వెంకటరమణతో కలిసి MEO, CRC హెచ్ఎంలతో రివ్యూ నిర్వహించారు. పాఠశాల వారీగా డ్రాప్స్ జాబితా ఇవ్వాలని సూచించారు. పిల్లలు 100% పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మిడ్ డే మీల్స్, హ్యాండ్ బుక్, FA-1 మార్కులు, CRC గ్రాండ్స్, MRC గ్రాండ్స్ పై రివ్యూ చేపట్టారు.

News September 10, 2025

చిత్తూరు డీసీసీబీ అవినీతి గుట్టురట్టు

image

చిత్తూరు డీసీసీబీలో జరిగిన అవినీతి గుట్టు రట్టయింది. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ఆర్థిక విధ్వంసం జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్ఓ మోహన్ కుమార్ విచారణ జరిపి నివేదిక కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అందజేయగా చర్యలు తీసుకోవాలని డీసీఓను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. గత పాలకమండలితోపాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.