News September 10, 2025

తొలి సభ.. సెల్ఫీలతో నేతల సందడి

image

‘సూపర్-6, సూపర్ హిట్’ సభ అనంతపురంలో ఉత్సాహంగా సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ కావడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా నేతలు పది రోజుల ముందే దృష్టి సారించడంతో లక్షలాది మంది జనం తరలివచ్చారు. కూటమి ఎమ్మెల్యేలందరూ తరలిరావడంతో స్టేజ్‌పై సందడి వాతావరణం నెలకొంది. నేతలు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

Similar News

News March 5, 2026

నిర్మల్: రేపు ఇన్‌ఛార్జ్ మంత్రి వీడియో కాన్ఫరెన్స్

image

నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం 11 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఐడీఓసీల నుంచి పాల్గొంటారు.

News March 5, 2026

సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

image

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.

News March 5, 2026

కామారెడ్డి: స్పోర్ట్స్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

image

కామారెడ్డి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించే లక్ష్యంతో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ స్కూల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. అర్హత కలిగిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.