News September 10, 2025
వనపర్తి: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత అన్నారు. ఈ నెల 13న వనపర్తి జిల్లా కోర్టులలో జరగనున్న లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. చిన్న కేసుల కోసం కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు.
Similar News
News March 28, 2026
రాత్రి ఫోన్ చేసి ఇన్నర్‌వేర్‌పై ప్రొఫెసర్ ప్రశ్నలు!

చెన్నైలోని అన్నా వర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానవేల్‌పై ఒక విద్యార్థిని సంచలన ఫిర్యాదు చేశారు. ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని దగ్గరై తనను వేధించాడని బాధితురాలు ఆరోపించారు. రాత్రి వేళల్లో ఫోన్ చేసి ఇన్నర్‌వేర్, పీరియడ్స్, పెళ్లి వంటి పర్సనల్ విషయాలపై అసభ్యంగా మాట్లాడుతూ టార్చర్ పెట్టేవాడని తెలిపారు. నంబర్ బ్లాక్ చేసినా ఇతర మార్గాల్లో వేధించాడని పేర్కొన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
News March 28, 2026
TU: ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

TU పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ(అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) విద్యను అభ్యసిస్తున్న 8వ, 10వ సెమిస్టర్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించడానికి నేడే చివరి తేదియని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. నేడు సాయంత్రం 5గం.ల లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుము రూ.100 తో ఈనెల 31లోగా చెల్లించవచ్చని తెలిపారు.
News March 28, 2026
పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై సర్కారు సీరియస్

AP: పంచాయతీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఇకపై ప్రతి గ్రామంలోనూ, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో విధిగా చెత్త సేకరణ చేపట్టాలని ఆదేశించింది. SASA యాప్ ద్వారా నివేదికలు సమర్పించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. స్వచ్ఛ రథాలు లేని చోట హరిత రాయబారుల ద్వారా చెత్తను సేకరించి రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది.


