News September 10, 2025
ములుగు: స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి: డీఈవో

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్-2025 కోసం అక్టోబర్ 6లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ములుగు డీఈవో ఏ.సిద్ధార్థరెడ్డి తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, అర్హత పరీక్షలో ఎంపికైతే 9, 10, ఇంటర్ రెండు సంవత్సరాలకు కలిపి నాలుగేళ్లకు గాను రూ.48,000 సాయం అందుతుందన్నారు. జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలన్నారు.
Similar News
News March 12, 2026
జహీరాబాద్: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

భార్య హత్య కేసులో భర్తకు సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. 2012లో జహీరాబాద్‌కు చెందిన లక్ష్మీతో రాములకు పెళ్లైంది. మద్యానికి బానిసైన రాములు తరచుగా భార్యతో గొడవ పడేవాడు. దీంతో లక్ష్మి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో 2021లో భార్య లక్ష్మిని రాములు స్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లి చున్నీతో హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.
News March 12, 2026
SVU: ఏప్రిల్ 15 నుంచి పరీక్షలు ప్రారంభం

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed/ B.P.Ed/ D.P.Ed 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు వర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 18 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటీ కళాశాలలోని రెండు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 12, 2026
ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.


