News September 10, 2025
తిరుపతిలో ISPS డేటా సైన్స్ సెంటర్ ప్రారంభం

నలందానగర్‌లో ఏర్పాటు చేసిన ISPS డేటా సైన్స్ సెంటర్, సిర్. రావు సెమినార్ హాల్‌ని బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. స్టాటిస్టిక్స్ కన్సల్టెన్సీ సెల్, ప్రొఫెసర్ పి.సి. మహలనోబిస్ కంప్యూటర్ లాబొరేటరీ, సెల్ఫ్-స్టడీ లైబ్రరీ, రూఫ్ గార్డెన్‌ని సందర్శించారు. స్టడీ లైబ్రరీలో విద్యార్థుల వసతుల గురించి ప్రెసిడెంట్ రాజశేఖరరెడ్డి కలెక్టర్‌కి వివరించారు.
Similar News
News March 10, 2026
ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు వీరివే

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో మహ్మద్ షమీ (22) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జహీర్ ఖాన్ (17), బుమ్రా(16), అశ్విన్ (16), సచిన్ టెండూల్కర్ (15), రవీంద్ర జడేజా (15) ఉన్నారు. టీ20 WC ఫైనల్‌లో 4 వికెట్లు తీసిన బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నారు.
News March 10, 2026
రజినీ-కమల్ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ మూవీ <<19199837>>ప్రోమో<<>> ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
News March 10, 2026
కృష్ణా: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత BUS సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.


