News September 10, 2025

కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది: మాధవ్

image

AP: ఏడాదిలో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ తెలిపారు. ‘సూపర్ సిక్స్ పథకాలను ఇతర రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తోంది. అమరావతికి ప్రత్యేకంగా రూ.15వేల కోట్ల గ్రాంట్ ఇస్తున్నాం. కేంద్ర సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుంది. త్వరలో ఏపీ సెమీ కండక్టర్ హబ్‌గా మారబోతోంది’ అని అనంతపురం సభలో పేర్కొన్నారు.

Similar News

News September 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* దసరా రోజున ఆటోడ్రైవర్లకు రూ.15,000: CM
* నేపాల్‌లో ఉన్న ఏపీ వారిని ప్రత్యేక విమానంలో తరలింపు: లోకేశ్
* చంద్రబాబు బావిలో దూకి చావాలి: జగన్
* TG: గత పాలకులు దోచుకున్న సొమ్ము రికవరీ చేస్తాం: కోమటిరెడ్డి
* రేవంత్ బీజేపీ సీఎం అని ముస్లింలు గుర్తించాలి: KTR
* కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా: రాజాసింగ్
*ఆసియా కప్‌లో భారత్ బోణీ.. UAEపై ఘన విజయం

News September 11, 2025

10 లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్

image

TG: భూభారతి చట్టం కింద సాదా బైనామా (నమోదు కాని లావాదేవీలు) క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులు భూ యాజమాన్య హక్కులను పొందుతారని ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు సమర్పించిన రైతుల సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని పేర్కొంది.

News September 11, 2025

గణేశ్ వేడుకల్లో అసభ్యప్రవర్తన.. 1,612 మందిని పట్టుకున్న షీటీమ్స్

image

TG: గణేశ్ వేడుకల్లో మహిళలతో 1,612 మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీమ్స్ గుర్తించింది. వీరిలో 68 మంది మైనర్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 168 మందిపై ‘పెట్టీ’ కేసులు నమోదు చేసి వీరిలో 70 మందిని కోర్టులో హాజరుపరచామని తెలిపింది. మరో 1,444 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది.
*షీటీమ్స్ సాయానికి డయల్ 100/వాట్సాప్ 9490616555