News September 10, 2025
సంగారెడ్డి: 238 మందికి జీపీవోలకు పోస్టింగ్

ఇటీవల గ్రామ పాలన అధికారులుగా నియామక పత్రాలు అందుకున్న 238 మందికి పోస్టింగ్ ఇస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. మండల కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న మరో 87 మందికి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. పోస్టింగ్ పొందిన వారు సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.
Similar News
News March 10, 2026
తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్

సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరింది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD వెల్లడించింది.
News March 10, 2026
రూ.25 లక్షల చోరీ కేసులో ఇద్దరికి 2 ఏళ్ల జైలు

అక్టోబర్ నెలలో హైదరాబాద్, బెంగళూరు బస్సులో జరిగిన రూ.25 లక్షల దొంగతనం కేసులో ఇద్దరికి డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.జ్యోతి 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. వెల్దుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.మధుసూదన్ రావు దర్యాప్తులో మహమ్మద్ షహీద్(35), సుహేబ్(20)ను అరెస్టు చేశారు. కేసును విజయవంతంగా నడిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కర్ రావు, పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
News March 10, 2026
జగిత్యాల: మద్యం మత్తులో ప్రాణం తీస్తే.. ఎనిమిదేళ్ల జైలు

మల్లాపూర్ రోడ్డు ప్రమాద కేసులో జగిత్యాల ప్రధాన సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బైక్ నడిపి గుండంపల్లికి చెందిన శివరాత్రి సాగర్ మృతికి కారణమైన వేంపేట్‌కి చెందిన మారంపెల్లి నవీన్‌కు కోర్టు 8 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.10 వెల జరిమానా విధించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు వాహన యజమాని మారంపెల్లి అంజయ్యకు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.


