News September 10, 2025
KMR: CM పర్యటన.. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

ఈ నెల 15న కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్, VIP రాకపోకల మార్గాలను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. CM పర్యటనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 4, 2026
‘దొంగతనాల కట్టడికి రైల్వే రక్షణ దళం చర్యలు’

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే రక్షణ దళం దొంగతనాల నియంత్రణపై చేపట్టిన చర్యల్లో గణనీయ ఫలితాలు సాధించింది. ఆపరేషన్ యాత్రి సురక్షా కింద 40 మంది నిందితులను అరెస్టు చేసి 41 కేసులు నమోదు చేశారు.
దొంగతనానికి గురైన రూ.22.05 లక్షల విలువైన ఆస్తులను రికవరీ చేశారు. సీసీటీవీ సహాయంతో నలుగురు నిందితులను పట్టుకుని, ప్రయాణికుల నుంచి దొంగిలించిన రూ.8 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
News March 4, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 4, 2026
అబ్బాయిలు కూడా HPV టీకా వేయించుకోవాలి: వైద్యులు

అమ్మాయిలతో పాటు 9-26 ఏళ్లలోపు ఉన్న అబ్బాయిలు కూడా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పురుషుల్లో వేగంగా పెరుగుతున్న గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్లను ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని చెబుతున్నారు. పురుషుల్లో ఈ రకమైన క్యాన్సర్లను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు లేవని, వ్యాక్సినేషన్ ఒక్కటే నివారణ మార్గమని సూచిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మగవారికి ఒక్క డోసు సరిపోతుంది.


