News September 10, 2025

2027 డిసెంబర్ నాటికి SLBC పూర్తి: మంత్రి ఉత్తమ్

image

2027 డిసెంబర్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకు కావాల్సిన రూట్ మ్యాప్ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. SLBC పూర్తిచేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు సురక్షితమైన తాగుగునీరు అందిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Similar News

News March 18, 2026

అనకాపల్లి: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి

image

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కింద నేటి నుంచి కనీసం 40 శాతం అంగవైకల్యం కలిగిన వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 18, 2026

విజయవాడకు 100 e-బస్సులు.. నిర్వహణకు రూ.46 కోట్లు

image

విజయవాడకు 100 e-బస్సులు కేటాయించారు. వీటిని విద్యాధరపురం డిపోలో మెయింటెనెన్స్ సెంటర్ (రూ.23 కోట్లు), సివిల్ పనులకు రూ.12.5 కోట్లు, సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్లకు రూ.10.5 కోట్లు, కేంద్రం 60%, పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 40% రాష్ట్ర నిధులు 6,000 KVA సబ్ స్టేషన్, 20 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇవి 6 నెలల్లో రోడ్లపైకి రానుండగా, పాత నగర బస్సులను దశలవారీగా ప్రభుత్వం తొలగించునుంది.

News March 18, 2026

నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కండలేరు, సోమశిల జలాశయాల భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి భూములను సంబంధిత శాఖకు అందించేలా చర్యలు తీసుకోవాలి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబధిత అధికారులకు సూచించారు. తన ఛాంబర్‌లో ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష చేశారు. ఆనం సంజీవయ్య బ్రాంచ్ కెనాల్, కేజీఎం బ్రాంచ్ కెనాల్‌ భూసేకరణ పూర్తైన తర్వాత అవార్డ్ జారీచేయడంతో పాటు యజమానులకు త్వరితగతిన పరిహారం చెల్లించాలని చెప్పారు.