News September 10, 2025
ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి: జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర

ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర అన్నారు. బుధవారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో 1 నుంచి 7 వరకు నిర్వహించిన స్థాయి సంఘ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. పరవాడ పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై జడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయవద్దని పలువురు జడ్పీటీసీలు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నారాయణమూర్తి పాల్గొన్నారు.
Similar News
News March 5, 2026
మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.111 కోట్లు విడుదల

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 5,201 ఇళ్లకు రూ.111 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇళ్లను ఆమె స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులు పనులు వేగవంతం చేయాలని, ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు.
News March 5, 2026
ఈరోజు నమాజ్ వేళలు (05-3-2026) గురువారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.20 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.24 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 5, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


