News September 10, 2025

వేములవాడ: ఇంటిపై పిడుగు.. ఉలిక్కి పడ్డ జనం

image

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో అకస్మాత్తుగా చిన్నపాటి వర్షంతో పిడుగు పాటు చోటుచేసుకుంది. పిడుగు ఓ ఇంటిపై పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పై భాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఊరట కలిగించింది.

Similar News

News March 21, 2026

అల్లవరం: గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

image

అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో గల్లంతైన అమలాపురం నారాయణపేటకు చెందిన దొమ్మేటి లోకేశ్(17) మృతదేహం శనివారం లభ్యమయింది. ప్రమాద స్థలానికి సమీపంలో అతని మృతదేహాన్ని గుర్తించారు. స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు వెళ్లి సముద్రంలో లోకేశ్ శుక్రవారం గల్లంతైన విషయం విధితమే. అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

News March 21, 2026

ADB: గ్యాస్ డెలివరీలో అలస్యమైతే.. కాల్ చేయండి

image

గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 21, 2026

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

image

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ₹500 అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఇదే సమయంలో వీఐపీ, ప్రొటోకాల్, బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఈ చర్యలు చేపట్టారు. 2 గంటల తర్వాత పరిస్థితులను బట్టి తిరిగి టికెట్ల జారీ చేయనున్నారు.