News September 10, 2025

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గిరిధర్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ పోలీసులు, వారియర్స్‌తో సమావేశం నిర్వహించిన ఆయన ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News March 19, 2026

ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

image

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.

News March 19, 2026

ఈరోజు నమాజ్ వేళలు (17-3-2026) మంగళవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:23 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 19, 2026

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం ఖరారు

image

ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ.. జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు. వీరితో పాటు 5 మంది అధికార ప్రతినిధులు, 15 మంది కార్యనిర్వాహక సభ్యులను నియమించారు.