News September 10, 2025
పనులు పెండింగ్‌లో ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పనిసరిగా EPTS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రికార్డులను వెంటనే అప్‌లోడ్ చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Similar News
News March 3, 2026
సీతానగరం మండలంలో యాక్సిడెంట్

సీతానగరం మండలం శ్రీరామనగరం చిట్టిబాబాజీ ఆశ్రమం వద్ద మంగళవారం సాయంత్రం 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రఘుదేవపురం పంచాయతీ కంచుమర్తి వారిపేటకు చెందిన మత్తాల స్టీఫెన్ ఆనంద్(15) నడుపుతున్న బైకు రాపాకకు చెందిన దంపతుల వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన స్టీఫెన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 2, 2026
పోలీస్ పీజీఆర్ఎస్‌లో 31 అర్జీలు: ఎస్పీ నర్సింహ కిషోర్

రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ జరిగింది. ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధికారులతో కలిసి బాధితుల నుంచి 31 అర్జీలను స్వీకరించారు. కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం బాధితులకు ఎంతో తోడ్పాటును అందిస్తోందన్నారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
News March 1, 2026
రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.


