News September 10, 2025

రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

image

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్‌లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.

Similar News

News April 1, 2026

కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

image

రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈస్ట్ యూరప్‌లోని క్రిమియాలో ఓ కొండను ఫ్లైట్ ఢీకొట్టిన ఘటనలో 29 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2026

అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

image

కేరళంలోని ఎట్టుమనూర్‌లో ఆశ్నా థంపి అనే 26ఏళ్ల జర్నలిస్ట్ ఎన్నికల బరిలోకి దిగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తనకు ఆస్తులేం లేవని.. ₹40 క్యాష్, బ్యాంక్ అకౌంట్‌లో ₹44 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడమే ఇందుకు కారణం. SUCI(C) పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె కేరళం ఎన్నికల బరిలో ఉన్న అత్యంత పేద అభ్యర్థిగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని ఆశ్నా చెబుతున్నారు. <<-se>>#Elections2026<<>>

News April 1, 2026

‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?

image

ఏటా ఏప్రిల్ 1న ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఫూల్స్ చేయడం చూస్తుంటాం. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన రూమర్ ఉంది. 1582లో ఫ్రాన్స్ తన క్యాలెండర్‌ను మార్చినప్పుడు కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుందని ప్రకటించింది. అయితే ఈ మార్పు తెలియక APR 1నే వేడుకలు చేసుకున్న వారిని అందరూ ‘ఫూల్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఈ ఏప్రిల్ ఫూల్ ప్రారంభమైందట. ఏదో ఒక సమయంలో మీరూ ఏప్రిల్ ఫూల్ అయ్యే ఉంటారు కదూ. COMMENT