News September 10, 2025

తూప్రాన్: ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

image

తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. మనోహరాబాద్ మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, రోగులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్‌కు సూచించారు.

Similar News

News March 5, 2026

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.

News March 5, 2026

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.111 కోట్లు విడుదల

image

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 5,201 ఇళ్లకు రూ.111 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇళ్లను ఆమె స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులు పనులు వేగవంతం చేయాలని, ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని సూచించారు.

News March 4, 2026

మెదక్: రేపటి నుంచి జనగణన శిక్షణకు డీఎస్ఓ

image

మెదక్ జిల్లా సైన్స్ అధికారి(DSO) రాజిరెడ్డి బుధవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. రేపటి నుండి హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగే జనగణన శిక్షణకు తాను హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే వేసవిలో చేపట్టనున్న మొదటి దశ ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని రాజిరెడ్డి వెల్లడించారు.