News September 10, 2025

TU: కొనసాగుతున్న M.Ed, L.L.B పరీక్షలు

image

టీయూ పరిధిలోని M.Ed, LLB పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో జరిగిన M.Ed 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4 బ్యాక్ లాగ్ పరీక్షలకు 37 మందికి 36 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారన్నారు. యూనివర్సిటీలో జరిగిన LLB 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 28 మంది హాజరయ్యారని వెల్లడించారు.

Similar News

News September 11, 2025

ముధోల్: గుండెపోటుతో యువ గాయకుడి మృతి

image

ముధోల్ గ్రామానికి చెందిన ముప్పిడి కిషోర్(32) యువ గాయకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రెండ్రోజుల క్రితం కరీంనగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లిన కిషోర్ బుధవారం HYDలో ఈవెంట్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహమైంది. 2 నెలల కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని ముధోల్ తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు.

News September 11, 2025

టీమ్ ఇండియాకు ఇదే ఫాస్టెస్ట్ విన్

image

ఆసియా కప్‌లో భాగంగా నిన్న UAEతో <<17672914>>మ్యాచులో<<>> భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. UAE నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్‌ను ఇండియా 4.3 ఓవర్లలోనే ఛేదించింది. మరో 93 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని అందుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో తన ఫాస్టెస్ట్ విన్‌ను నమోదు చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాంట్లాండ్‌పై సాధించిన విజయమే (81 బాల్స్ మిగిలి ఉండగా గెలిచింది) రికార్డుగా ఉంది.

News September 11, 2025

MHBD: దోమల నివారణకు ఫాగింగ్ జాడెక్కడ..?

image

జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో దోమల నివారణ చర్యలు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఏటా దోమల నివారణకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఆచరణలో ఫాగింగ్ కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.