News September 10, 2025

పెద్దపల్లి: గోదావరి పుష్కరాలకు కార్యాచరణ సిద్ధం

image

జిల్లాలో 2027 గోదావరి పుష్కరాల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్నాన ఘాట్ల మరమ్మతులు, కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. కొత్తగా సురబండేశ్వర, గోలివాడ ఘాట్ల పునర్నిర్మాణం చేపట్టాలన్నారు.

Similar News

News March 18, 2026

HYD: తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి..!

image

ఇంజినీర్ల బదిలీలు అత్యంత పారదర్శకంగా ఉండేలా నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయం బహుశా తెలంగాణ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులు పనిచేయవని సర్క్యులర్‌ జారీ చేసింది. ఏదైనా సిఫార్సు లేఖతో సంప్రదిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బదిలీల విషయమై అధికార పార్టీ నాయకుల నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వరకు భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 18, 2026

PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

image

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News March 18, 2026

నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

image

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.