News September 10, 2025

సంగారెడ్డి: విద్యాభివృద్ధికి టీఎల్‌ఎం మేళా దోహదం: ఎఎంఓ

image

టీఎల్‌ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎఎంఓ బాలయ్య పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని రావ్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాను ఎఎంఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యా బోధన మరింత మెరుగుపరచుకునేందుకు పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎల్‌ఎం ఉపయోగ పడుతుందని అన్నారు.

Similar News

News March 24, 2026

తగ్గేదే లే.. యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

image

పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌పై దాడులకు US అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినా తాము మాత్రం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయన్నారు. కాగా దాడుల్లో సాధించిన విజయాలే డీల్‌లో పైచేయి సాధించడానికి కీలకం అవుతాయని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పారని తెలిపారు.

News March 24, 2026

టీజీ ఎప్‌సెట్‌కు 2,20,879 దరఖాస్తులు

image

టీజీ ఎప్‌సెట్‌కు దరఖాస్తులు ఊపందుకున్నాయి. ఇంటర్‌ వార్షిక పరీక్షలు ముగియడంతో దరఖాస్తులు జోరందుకున్నాయి. సోమవారం వరకు 2,20,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. విభాగాలవారీగా తీసుకొంటే ఇంజినీరింగ్‌కు 1,55,804మంది, అగ్రికల్చర్‌& ఫార్మసీ విభాగానికి 64,866, 2 పేపర్లకు హాజరయ్యేందుకు 209 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 13 వరకు 1.3లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

News March 24, 2026

వరంగల్ జిల్లాలో టీబీ కేసులు.. వైద్యుల సూచనలు

image

జిల్లాలో టీబీ (క్షయ) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది 73,991 మందికి పరీక్షలు చేయగా 1,260 మందికి టీబీ నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,780 మందికి పరీక్షలు నిర్వహించగా 287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సుమారు 876 మంది చికిత్స పొందుతున్నారు. దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
# నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం