News April 4, 2024

కడప: వాహన తనిఖీల్లో రూ.10 లక్షలు సీజ్

image

కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లె చెక్ పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు రూ.10 లక్షల నగదును సీజ్ చేశారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ నగదును స్వాధీన పరచుకున్నారు. అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు కారులో ఓ మహిళ వెళుతుండగా ఆమె నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కడప జిల్లాతో NTRకు అనుబంధం.. మీకు తెలుసా!

image

దివంగత నేత NTRకు కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. NTR 1983లో తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంలో హరికృష్ణ డ్రైవర్‌గా రోడ్డు షో నిర్వహించారు. ఈ యాత్ర తాళ్ల ప్రొద్దుటూరు, పాతచౌటపల్లి, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా సాగింది. పాతచౌటపల్లి చిత్రావతి నదిలో చైతన్య రథం మొరాయించడంతో అక్కడే ఆయన బస చేశారు. తిరిగి 1984లో పులివెందుల, కొండాపురం తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నేడు NTR వర్ధంతి.