News September 10, 2025

అనీమియా పట్ల అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని, దానిని పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారంతో పాటు ఐసీడీఎస్, డీఆర్డీఏ ద్వారా అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు 21 రకాలు కలిగిన అదనపు కిట్లను ఐసిడిఎస్ ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు.

Similar News

News March 10, 2026

జనాభా గణనలో 33 అంశాలపై వివరాల సేకరణ: కలెక్టర్

image

మొదటి దశ జనాభా గణనలో 33 అంశాలపై వివరాలు సేకరిస్తామని HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం, అలాగే రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు తదితర వివరాలు సేకరిస్తారని చెప్పారు.

News March 10, 2026

HNK: డిజిటల్ విధానంలో తొలిసారిగా జనాభా గణన

image

దేశంలోనే మొదటిసారిగా డిజిటల్ విధానంలో జనాభా గణన ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి డిజిటల్ రూపంలో జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగే మొట్ట మొదటి జనాబా గణన అన్నారు. ఇక్కడ మొదటి దశలో జరిగే హౌస్‌లిస్టింగ్(ఇళ్ల జాబితా), గృహాల గణన 2026 మే 11న ప్రారంభమై 2026 జూన్ 9న ముగుస్తుందన్నారు.

News March 10, 2026

నిజామాబాద్: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బూరుడుగల్లీలో సతీష్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లారెడ్డిలో ఇల్లరికం ఉన్న సతీష్, భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇటీవల నగరానికి తిరిగి వచ్చి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. 2వ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.