News September 10, 2025

సంగారెడ్డి: జిల్లా స్థాయి క్రీడలకు ఏర్పాట్లు పూర్తి

image

ఖేడ్‌లోని తహశీల్దార్ మైదానంలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగే వాలీబాల్ టోర్నమెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఖేడ్‌లో బుధవారం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 11న అండర్-14, 17 బాలురకు, 12న బాలికలకు జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో పీడీలు పాల్గొన్నారు.

Similar News

News March 11, 2026

ADB: కష్టాల్లో కౌలు రైతులు.. నిండా ముంచిన పత్తి

image

ఉమ్మడి ADB జిల్లాలో సుమారు 65 వేల మంది కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ASFలో 15, ADBలో 21, MNCLలో 12, NRMLలో 8 వేల మంది వరకు కౌలు రైతులు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. పత్తి దిగుబడి ఎకరాకు 3–4 క్వింటాళ్లకు పడిపోయింది. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టిన రైతులకు కనీస ఖర్చులు కూడా రాలేదు. సాగునీరు లేక రెండో పంట వేయలేక, ప్రైవేట్ వడ్డీల భారం పెరిగి రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

News March 11, 2026

అల్లూరి: పరీక్షలకు 67 మంది గైర్హాజర్

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 67మంది గైర్హాజర్ అయ్యారని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో మెథ్స్, హిస్టరీ, అకౌంటెన్సీలలో పరీక్ష జరిగిందన్నారు. అల్లూరి జిల్లాలో 387 మందికి గాను 350 మంది విద్యార్థులు పరీక్షలు రాసారన్నారు. పోలవరం జిల్లాలో 338 మందికి గాను 308 మంది హాజరయ్యారని వెల్లడించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయాని చెప్పారు.

News March 11, 2026

మార్చి 15 నుంచి భారీ వర్షాలు: వాతావరణ నిపుణులు

image

TG: మార్చి 15 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తొలుత ఉత్తర, మధ్య తెలంగాణలో వానలు పడతాయని పేర్కొన్నారు. మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా వడగళ్ల వర్షాలతో పాటు భారీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రైతులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటాయని హెచ్చరించారు.