News September 10, 2025

నేపాల్ తాత్కాలిక PMగా సుశీల!

image

నేపాల్‌ తాత్కాలిక PMగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ పేరును ఆందోళనకారులు ప్రతిపాదించారు. Gen-Z గ్రూప్‌తో వర్చువల్‌గా సమావేశమైన సుశీల తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్‌తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనకు Gen-Z గ్రూప్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 11, 2025

సెప్టెంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

1906: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం ప్రారంభం
1911: భారత మాజీ కెప్టెన్ లాలా అమర్‌నాథ్ జననం
1895: స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే జననం
1947: కవి దువ్వూరి రామిరెడ్డి మరణం
1948: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా మరణం
2022: నటుడు కృష్ణంరాజు మరణం (ఫొటోలో)
☞ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

News September 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 11, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.34 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.