News April 4, 2024
ASF: ఏనుగు దాడిలో మరో రైతు మృతి

జిల్లాలో నిన్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుపై ఏనుగు దాడి జరిగింది. కారు పోచన్న అనే రైతు ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలం వద్ద ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News April 22, 2025
ADB: వడదెబ్బతో ఒకరి మృతి

వడ దెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన నార్నూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. భీంపూర్ గ్రామానికి చెందిన చవాన్ కేశవ్(60) ప్రతి రోజు వెళ్లినట్లుగా సోమవారం ఉపాధిహామీ పనికి వెళ్లి పని పూర్తిచేసుకొని తిరిగి ఇంటికొచ్చాడు. దాహంగా ఉండడంతో మంచినీరు తాగి సేద తీరుతామని మంచంపై కాసేపు పడుకుంటామని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన అక్కడికే కుప్పకూలిపోయాడు. నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరారు.
News April 22, 2025
భీంపూర్: రైతు బిడ్డకు బ్యాంక్ మేనేజర్ కొలువు

భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన అడెపు అశోక్, కళావతి వారికి ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తూ.. కూలి పనులు చేసుకుంటున్నారు. వారి కొడుకు శ్రీకాంత్ సోమవారం వెలువడిన బ్యాంక్ ఫలితాల్లో సత్తాచాటారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీకాంత్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
News April 22, 2025
జాగ్రత్త.. పోలీసులమని చెబితే నమ్మకండి: ADB DSP

సివిల్ డ్రెస్సులో పోలీసులమంటూ వాహన తనిఖీలు నిర్వహించినా, విలువైన ఆభరణాలు అడిగినా, వారు పోలీసులు కాదనే విషయాన్ని గ్రహించలని ADB DSP జీవన్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. బేల మండలంలో నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ బంగారం అపహరించారని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటూ నూతన పద్ధతులలో మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల చెర నుంచి తప్పించుకోవాలని సూచించారు.