News September 10, 2025
HYD: కూల్చివేతలపై ఎంపీ ఈటల ఆగ్రహం

మల్కాజ్‌గిరి MP ఈటల రాజేందర్ ఈరోజు సికింద్రాబాద్ జేబీఎస్ ఎరుకల బస్తీని సందర్శించారు. షాపుల కూల్చివేతపై వ్యాపారులతో మాట్లాడిన ఆయన, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల జీవనోపాధికి భంగం కలగకుండా అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 18, 2026
HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.
News March 18, 2026
హైదరాబాద్‌లో హోటళ్లు బంద్!

నగరంలో LPG సిలిండర్ల కొరతతో వ్యాపారాలు మూసేసే పరిస్థితి నెలకొంది. దాదాపు 2 వేల వరకు చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేసినట్లు తెలుస్తోంది. కొన్ని హోటళ్ల నిర్వాహకులు రూ.10 నుంచి రూ.30 వరకు ఎక్స్‌ట్రా(గ్యాస్ ఛార్జ్) అని బోర్డులు పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. LPG సిలిండర్లు అందుబాటులో లేకపోతే హోటళ్లు నడపడం కష్టమే అని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
News March 18, 2026
HYDని ఉర్రూతలూగిస్తున్న లేటెస్ట్ ట్రెండ్!

HYD అంటే బిర్యానీ, చార్మినార్ మాత్రమే కాదు! మారుతున్న కాలంతో పాటు మన నగరం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. పాతతరం వారసత్వాన్ని నెమరేసుకుంటూనే, యువత ‘మీట్-అప్’ కల్చర్‌తో కొత్త బంధాలను అల్లుకుంటున్నారు. పండుగ ఏదైనా ప్రపంచమంతా ఇక్కడే ఉన్నట్లుగా జరుపుకోవడం మన ‘గంగా-జమునీ తెహజీబ్’ ప్రత్యేకత. పల్లె-పట్టణాల కలయికతో, ఆధునికతను ఆహ్వానిస్తూ.. సరికొత్త జోష్‌లో మెరిసిపోతోంది. HYD వైబ్ అంటే ఇలా ఉండాలి మరి!


