News September 10, 2025

HYD: ప్రైవేట్ భూముల రోడ్ల జోలికి హైడ్రా వెళ్ల‌దు: రంగనాథ్

image

ప్రైవేట్ భూముల వివాదాల జోలికి వెళ్లమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. ‘చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే ఊరుకోం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. దళారీల మాయ మాటలు నమ్మవద్దని, వారి చేతిలో మోసపోవద్దని బుధవారం హైడ్రా విజ్ఞప్తి చేసింది.

Similar News

News March 25, 2026

GK: భారత చరిత్రలో మొట్టమొదటి వ్యక్తులు

image

⋆ తొలి రాష్ట్రపతి- డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
⋆ తొలి ప్రధాని- జవహర్‌లాల్ నెహ్రూ, * తొలి మహిళా రాష్ట్రపతి-ప్రతిభా పాటిల్
⋆ తొలి మహిళా PM-ఇందిరా గాంధీ
⋆ ఉపరాష్ట్రపతి-డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
⋆ అంతరిక్ష యాత్రికుడు-రాకేష్ శర్మ
⋆ నోబెల్ బహుమతి గ్రహీత-రవీంద్రనాథ్ ఠాగూర్
⋆ మహిళా IPS కిరణ్ బేడీ, మహిళా గవర్నర్-సరోజినీ నాయుడు ⋆ లోక్‌సభ మొదటి స్పీకర్-జి.వి.మౌలాంకర్
⋆ లోక్‌సభ మహిళా స్పీకర్-మీరా కుమార్

News March 25, 2026

అగ్నివీర్స్‌కు 20% రిజర్వేషన్.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ!

image

2027లో నాలుగేళ్ల టర్మ్ పూర్తి చేసుకునే అగ్నివీర్లకు ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి అమిత్ షా లేఖ రాశారు. ఫారెస్టు గార్డులు, మైనింగ్ గార్డులు, పోలీస్ కానిస్టేబుల్స్, ఫైర్‌మెన్, జైల్ వార్డెన్లు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, SDRFలో ఈ మేరకు కోటా ఇవ్వాలని పేర్కొన్నారు. పలు యూనిఫామ్ సర్వీసుల్లో అగ్నివీర్లకు రిజర్వేషన్ కల్పిస్తామని హరియాణా, ఉత్తరాఖండ్ ప్రకటించాయి.

News March 25, 2026

క్షయ నిర్మూలనలో జగిత్యాలకు ‘స్టేట్ అవార్డు’

image

వరల్డ్ TB డే(నిన్న) సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన వేడుకల్లో JGTL జిల్లా సత్తా చాటింది. క్షయ వ్యాధి నిర్మూలనలో విశేష కృషి చేసినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లా 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్యాధికారి డా.నీలారపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమష్టి కృషితోనే ఈ అవార్డు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన సేవలందించడంలో జిల్లా ముందుందన్నారు.