News September 10, 2025

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం: లక్ష్మీశా

image

నేపాల్‌లో చిక్కుకున్న ఎన్టీఆర్ జిల్లా వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. 91549 70454 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కాగా 261 మంది తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. ఖాట్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ద్వారా వారిని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

Similar News

News March 12, 2026

ఈ తేదీల్లో చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

image

యలమంచిలి(M) చించినాడ వంతెనపై మరమ్మత్తు పనుల దృష్ట్యా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. మార్చి 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వంతెనపై ఎటువంటి వాహనాలను అనుమతించరు. తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆయా తేదీల్లో ప్రయాణం చేసే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.

News March 12, 2026

‘సాగర్‌కు కొత్త దారి’.. అధికారులకు సీఎం ఆదేశం!

image

రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీలో సీఎం కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్‌కు త్వరితగతిన చేరుకునేలా నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ఈ సరికొత్త రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరి, సాగర్ పర్యాటకంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారనుంది.

News March 12, 2026

గుంటూరులో విషాదం

image

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.