News September 10, 2025

HYD: హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

image

HYD హైకోర్టు ఎదుట బుధవారం అడ్వకేట్లు పాంప్లెట్లతో నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ సురేశ్ బాబుపై జరిగిన దాడికి నిరసనగా గేట్ నంబర్ 6 వద్ద నిరసన ప్రోగ్రాం నిర్వహించారు. వెంటనే సత్వర న్యాయం జరగాలని అందరూ కలిసి డిమాండ్ చేశారు.

Similar News

News March 13, 2026

సంగారెడ్డి జిల్లాకు రూ.2.10 కోట్లు ఎంపీ నిధులు

image

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితో సంగారెడ్డి జిల్లాకు భారీగా ఎంపీ నిధులు మంజూరయ్యాయని బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ మండలాల్లోని 21 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.10 కోట్లు అనుమతి లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

News March 13, 2026

చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

image

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు

News March 13, 2026

ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.