News September 10, 2025
ఝార్ఖండ్ సీఎంను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి

ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. భేటీలో తమ అనుభవాలను పంచుకోవడం, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందించాలనే అంశాలపై చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Similar News
News September 11, 2025
ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!

ఖమ్మం టేకులపల్లి ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. HYD అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. D/B పార్మసీ, ఎస్ఎస్సీ ఆపైన విద్యార్హత కలిగి, 18 నుంచి 35 సం.రాలు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు విద్యార్హత పత్రాలతో జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.
News September 11, 2025
అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారితనంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. బుధవారం ఖమ్మం TTDC మీటింగ్ హాల్‌లో మధిర నియోజకవర్గంలో చేపట్టనున్న పైలెట్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహణపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సానుకూలంగా ఉన్న ప్రతి దరఖాస్తును పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని దరఖాస్తులకు కారణాలు తెలియజేస్తూ లేఖ రాయాలని సూచించారు.
News September 10, 2025
ఖమ్మం: పారదర్శకంగా గ్రామ పరిపాలన అధికారుల కౌన్సిలింగ్

ఖమ్మం కలెక్టరేట్‌లో గ్రామ పరిపాలన అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. పైరవీలకు తావులేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 299 క్లస్టర్లలో 252 మందికి పోస్టింగ్‌లు కల్పిస్తున్నామని చెప్పారు.
భూ భారతి చట్టం అమలు, భూ సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.