News September 10, 2025
ఆన్‌లైన్ అడ్మిషన్లకు రెండు రోజులు అవకాశం: డీఐఈవో

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులు చివరి అవకాశం కల్పించనున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు ఆగస్టు 31తో చివరి అవకాశం ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ పెండింగ్ ఉందన్నారు. దీంతో ఈనెల 11, 12న అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 10, 2026
25,305 మంది ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్: DMHO

జిల్లాలోని 52 PHC, 29 పట్టణ PHCలు, 10 CHCలతోపాటు GGH ఆత్మకూరు, కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలోనూ ఈ HPV వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు DMHO సుజాత తెలిపారు. ఉచితంగా వేసే ఈ HPV వ్యాక్సిన్‌ను ఎంపిక చేసిన ఆడపిల్లలకు 0.5 ml డోస్‌ను బుధవారం నుంచి ఇవ్వననున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 14 ఏళ్లు పైడి 15 ఏళ్లలోపు ఆడపిల్లలు 25,305 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.
News March 10, 2026
వాళ్ల ఒత్తిడితోనే వెనక్కి తగ్గిన ట్రంప్?

ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనమైందని ట్రంప్ చెబుతున్నా.. యుద్ధం ముగింపునకు వచ్చిందన్న ప్రకటన వెనక ఆయన అడ్వైజర్ల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ధరలు పెరగడం, US ప్రజల మద్దతు లేకపోవడం, ఇరాన్ తగ్గే సూచనలు కనిపించకపోవడం, మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఎక్కడ డెమోక్రాట్లకు ప్లస్ అవుతుందోనన్న భయం ఉన్నట్లు సమాచారం.
News March 10, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.


