News September 10, 2025

సిద్దిపేట: RMPల వద్దకు వెళ్లకుండా చూడాలి: DMHO

image

ప్రజలు ప్రైవేట్ ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని DMHO డాక్టర్ ధనరాజ్ సూచించారు. బుధవారం తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తిమ్మాపూర్, అనంతసాగర్‌లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును సందర్శించారు. ఆరోగ్య సమస్యల పై ముఖ్యంగా ఫీవర్ కేసుల గురించి రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. జ్వరంతో వచ్చిన వారికి రక్త నమూనాలను సేకరించాలన్నారు.

Similar News

News September 11, 2025

గంగారాం: ఒకే రోజు నాలుగు డెలివరీలు!

image

గంగారం మండలం కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో డా.సాయినాథ్ ఒకేరోజు నాలుగు డెలివరీలు చేసి ఏజెన్సీ ప్రాంతంలో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల(డెలివరీ) సంఖ్య సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన కోమట్లగూడెంలో ఒకే రోజు నాలుగు డెలివరీలు చేయడం విశేషం. ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ను స్థానికుల అభినందించారు.

News September 11, 2025

KMR: 73 మందికి జరిమానా.. ఒకరికి జైలు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై KMR జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 73 మందికి కోర్టు జరిమానా విధించింది. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. మద్యం తాగి వాహనం నడపడం ప్రాణాంతకమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

News September 11, 2025

మంచి మనసు చాటుకున్న లారెన్స్!

image

నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నై రైళ్లలో స్వీట్ అమ్ముతూ బతుకు బండిని నడిపిస్తున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్యకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష అందిస్తానని, ఆయన వివరాలు తెలిస్తే చెప్పాలంటూ Xలో ఫొటోను షేర్ చేశారు. రైలులో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయాలని కోరారు. ఫొటోలో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదని తెలిపారు.